Share News

2.70 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:37 AM

ఒడి శాలోని బరంపురంలో కొనుగోలు చేసిన 2.70 కిలోల గంజాయిని రే ణుగుంటకు తరలించేం దుకు సిద్ధమవుతున్న వ్యక్తిని పోలీసులు ప ట్టుకున్నారు.

2.70 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ చిన్నమనాయుడు

ఇచ్ఛాపురం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని బరంపురంలో కొనుగోలు చేసిన 2.70 కిలోల గంజాయిని రే ణుగుంటకు తరలించేం దుకు సిద్ధమవుతున్న వ్యక్తిని పోలీసులు ప ట్టుకున్నారు. గురువారం సీఐ మీసాల చిన్నమనాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌ కుమార్‌ రేణిగుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో నివాసం ఉంటూ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సా గర్‌తో పరిచయం ఏర్పడింది. సాగర్‌ ఒడిశా రాష్ట్రం గుమ్మ ప్రాంతానికి చెందిన గంజాయి వ్యాపారి సునీల్‌ కుమార్‌ను అనూజ్‌ కుమార్‌కు ఫోన్‌లో పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం బరంపురం చేరుకున్న అనూజ్‌ కుమార్‌ గంజాయిని సునీల్‌ కుమార్‌ వద్ద కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇదే సమయంలో పోలీసులు అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా 2.70 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో గంజాయిని సీజ్‌ చేసి, అనూజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 12:37 AM