అగ్నివీర్‌కు 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్స్
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:38 PM
నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)కు చెందిన 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అగ్ని వీర్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్, ఎన్‌సీసీ అధికారి డాక్టర్ యాళ్ల పోలి నాయుడు తెలిపారు.
పాత శ్రీకాకుళం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు)కు చెందిన 25 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు అగ్ని వీర్‌కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్, ఎన్‌సీసీ అధికారి డాక్టర్ యాళ్ల పోలి నాయుడు తెలిపారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్‌తో పాటు ఎన్‌సీసీ బి,సి సర్టిఫి కెట్లు పొందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికైన వారిలో ఉన్నారన్నారు. దేశ రక్షణకు అవసరమైన శిక్షణకు త్వరలో వెళ్లనున్న విద్యార్థులను ఆయ న అభినందించారు. కార్యక్రమంలో 14వ ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ అధికా రులు, సీఐ తదితరులు పాల్గొన్నారు.