Share News

21.5 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:17 AM

గంజాయి ర వాణా చేస్తున్న ము గ్గురు యువకులతో పాటు ఒక మైనర్‌ ను అరెస్టు చేసి, వారి నుంచి 21.5 కిలోలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.సత్యనారాయణ తెలిపారు.

21.5 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సత్యనారాయణ

  • మైనర్‌, మరో ముగ్గురు అరెస్టు

  • సీఐ సత్యనారాయణ

ఆమదాలవలస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): గంజాయి ర వాణా చేస్తున్న ము గ్గురు యువకులతో పాటు ఒక మైనర్‌ ను అరెస్టు చేసి, వారి నుంచి 21.5 కిలోలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. బుధవారం పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మునిసిపాలిటీ పరిధి 18వ వార్డు కండ్రపేట శ్మశాన వాటిక వద్ద ఎస్‌ఐ బాలరాజు సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఇద్దరు యువకులు ఒక మైనర్‌ గంజాయితో పట్టుబడ్డారు. కొత్త కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్‌, ఐదో వార్డు సొట్టవానిపేట టీజీఆర్‌ నగర్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ తహీర్‌బాబుతో పాటు ఒక మైనర్‌ గంజాయిని ఒడిశా రాష్ట్రం కల్లికోట్‌కు చెందిన నీలాంచల్‌ పట్నాయక్‌ వద్ద కొనుగోలు చేసి రైలులో ఆమదాలవలసకు తీసుకువ స్తూ కొంత వీరు సేవించి.. మరికొంత విక్రయిస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే బుధవారం కూడా గంజాయిని కొనుగోలు చేసి తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. గంజాయిని ఒడిశాకు చెందిన నీలాంచల్‌ పట్నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కారుణ్య జగదీష్‌పై ఇప్పటికే తొమ్మిది కేసులున్నాయని, 2024లో గంజాయి కేసు నమోదైందని ఇతడిపై స్టేషన్‌లో హిస్టరీషీట్‌ కూడా ఉ న్నట్టు తెలిపారు. సయ్యద్‌ తాహిర్‌పై రెండు దొంగతనాల కేసులున్నాయన్నారు. కేసు నమోదు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించ నున్నట్టు తెలిపారు. మైనర్‌ను జువైనల్‌ హోంకు తరలిస్తామన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:17 AM