శబరిమలకు 11 మంది భక్తుల సైకిల్ యాత్ర
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:48 PM
రణస్థలం మండ లం నారువా గ్రామం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ మేరకు గురువారం ఈ సైకిల్ యాత్రను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు జెండా ఊపి ప్రారంభించారు.
గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఇదే బృందానికి పుంగనూరులో అవమానం
రణస్థలం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రణస్థలం మండ లం నారువా గ్రామం నుంచి 11 మంది అయ్యప్ప భక్తులు సైకిల్‌పై శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ మేరకు గురువారం ఈ సైకిల్ యాత్రను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు జెండా ఊపి ప్రారంభించారు. సర్పంచ్ నిద్రబంగి రామ కృష్ణ నేతృత్వంలో 11 మంది భక్తులు మకరసంక్రాంతి రోజున అయ్యప్పజ్యోతి దర్శనం చేసేందుకు నిర్ణయించుకున్నారు. సు మారు 1500 కిలో మీటర్లు సైకిళ్లపై యాత్ర చేపట్టేందుకు బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హ యాంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఇదే బృందం ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తిరుమలకు సైకిల్ యాత్ర చేపట్టగా చిత్తూరు జిల్లా పుంగనూరులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులు అడ్డుకుని చొక్కాలను చింపి తీవ్రంగా అవ మానించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైకిళ్లపై వారంతా తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కడప జిల్లాలో జరిగిన మహానాడుకు హాజరు కాగా సీఎం చంద్రబాబు నాయుడు వారిని ఆత్మీయంగా సన్మానించారు.