వసప కేజీబీవీలో 10.5 క్వింటాళ్ల బియ్యం సీజ్
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:56 PM
విద్యార్థుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టిన ఘటన వసప కేజీబీవీలో చోటు చేసుకుంది.
అక్రమ రవాణాకు రహస్య గదిలో నిల్వ
దసరా సెలవుల్లో దారి మళ్లింపునకు ప్రణాళిక
అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో వెలుగులోకి..
తహసీల్దార్ పరిశీలన.. బియ్యం స్వాధీనం
కొత్తూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టిన ఘటన వసప కేజీబీవీలో చోటు చేసుకుంది. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో వసప కేజీబీవీ ప్రిన్సిపాల్ అక్రమాలు వెలుగులో వచ్చా యి. పక్కా సమాచారం అందుకున్న తహసీల్దార్ కొప్పల బాలకృష్ణ శనివారం మధ్యాహ్నం వసప కేజీబీవీని సందర్శించి తనిఖీలు చేపట్టారు. రికా ర్డులు ప్రకారం స్టాక్ 248 కిలోలు ఉండాల్సి ఉం డగా.. వీటికంటే అదనంగా 1150 కిలోల (సుమా రు 10.5 క్వింటాలు) బియ్యం ఉన్నట్టు గుర్తించారు. 25 కిలోల చొప్పున్న ఉన్న సుమారు 46 ప్యాకెట్లు పాఠశాలలోని ఓ రహస్య గదిలో సామగ్రితో కలిపి దాచిపెట్టిన బియ్యాన్ని తహసీల్దార్ గుర్తిం చారు. దీనిపై ప్రిన్సిపాల్ రాధికను తహసీ ల్దార్ ప్రశ్నించారు. ఎన్నిరోజుల నుంచి వి ద్యార్థులకు భోజనాలు పెట్టకుండా బియ్యం మిగిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22వ తేదీ నుంచి దసరా సెలవు లు కావడంతో శనివారం విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత వీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకు న్నట్టు తెలుస్తుంది. తమ పిల్లలను పాఠ శాలలో చేర్పిస్తే అరకొర ఆహారం అందిం చి పస్తులు పెడుతుం డడంపై తల్లిదండ్రు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ప్రిన్సిపాల్ రాధికపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ బాలకృష్ణ మాట్లాడు తూ.. సీజ్ చేసిన బియ్యాన్ని స్థానిక వీఆర్వోకు అప్పగించి, చర్యలకై సమగ్రశిక్ష అభియాన్ ఏపీసీకి నివేదిస్తామని తెలిపారు.