Share News

10 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:33 PM

గొలియాపుట్టి వద్ద పేకాట ఆడుతున్న 10 మందిని టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకొని తమకు అప్పగించినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.

10 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

జలుమూరు, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): గొలియాపుట్టి వద్ద పేకాట ఆడుతున్న 10 మందిని టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకొని తమకు అప్పగించినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. గొలియాపుట్టి వద్ద పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం దాడిచేసి పేకాట ఆడుతున్న 10 మందిని పట్టుకొన్నారన్నారు. వారి వద్ద నుంచి రూ.43,810 నగదు, 2 కార్లు, 4 ద్విచక్రవాహనాలు, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుల ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వీఆర్‌ పేటలో భూ తగాదా.. ఒకరికి గాయాలు

జి.సిగడాం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నాగులవలస పంచాయతీ వీఆర్‌ పేటలో ఆదివారం భూ తగాదాలో ఒకరికి గాయా లయ్యాయి. వీఆర్‌ పేట గ్రామానికి చెందిన కంచర్ల శశిధర్‌ ట్రాక్టర్‌తో తన పొలంతో దున్నేందుకు వెళ్తుండగా.. అదేగ్రామానికి చెందిన బత్తుల వెంకటప్పారావు తన పొలంలో నుంచి వెళ్లాడని కర్రతో తలపై బలంగా కొట్టాడు. గాయపడిన శశిధర్‌ను చికిత్స నిమిత్తం రాజాం సామాజిక ఆసుప త్రికి తరలించారు. ఈ విషయంపై ఎస్‌ఐ వై.మధుసూదనరావు మాట్లాడుతూ.. తగాదా విషయం నా దృష్టికి వచ్చిందని, కేసు నమోదు చేయాల్సి ఉందని తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

టెక్కలి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): టెక్కలి శ్రీని వాస్‌నగర్‌కు చెందిన రొక్కం రాజారావు (66) టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో శనివారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు రాజారావు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌ క్లీనర్‌ తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలి స్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:33 PM