అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:59 PM
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ జిల్లా సభ్యుడు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు నేతింటి నీలంరాజు తెలిపారు.
పోలాకి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ జిల్లా సభ్యుడు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు నేతింటి నీలంరాజు తెలిపారు. సోమవారం పోలాకిలో విలేకరులతో మాట్లాడుతూ సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస వద్ద ఏర్పాటుచేస్తున్న థర్మల్ ప్లాంట్‌ను ఆపాలని నిరసన వ్యక్తంచేస్తున్న ఉద్యమ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టుచేయడం సరైన పద్ధతికాదని తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల రైతులకు ఇబ్బంది ఏర్పడుతుందని భావించి ఈ సమస్యపై ఆందోళన చేపడితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.వారికి విడుదలచేయాలని కోరారు.
ఫ నరసన్నపేట, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి ఽథర్మల్ ఉద్యమాన్ని ఆపలేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు ఆరోపిం చారు. ఽథర్మల్ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న శ్రీనివాసరావును సోమవారం చేనులవలసలో గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ థర్మల్ ఉద్యమంపై ప్రజాప్రతినిధులు నోరు ఎందుకు మెదపడంలేదని ప్రశ్నంచారు.