ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సహకారం అందించండి: ఎమ్మెల్యే శిరీష
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:34 PM
మందస, వజ్రపుకొత్తూరు మండలాల మధ్యలో ఏర్పాటయ్యే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకారం అందించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమవారం ప్రజాఫిర్యాదులను స్వీకరించారు.
పలాస, జూలై 21(ఆంధ్రజ్యోతి): మందస, వజ్రపుకొత్తూరు మండలాల మధ్యలో ఏర్పాటయ్యే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతులు, ప్రజలు సహకారం అందించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సోమవారం ప్రజాఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మందస మండలానికి చెందిన రైతులు ఎమ్మెల్యేకు తమ భూములకు ఇబ్బందులు లేకుండా ఎయిర్‌పోర్టు నిర్మించాలని కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఇంకా ఎంత మేరకు భూములు కావాలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, భూసార పరీక్షలు చేసిన తరువాత ఆమోదం తెలిపితేనే తప్ప భూ సేకరణ జరగదని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా భూ సేకరణ జరుగుతుందని, దీనిపై ప్రజలకు ఉన ్న అపోహలు తొలగిస్తామన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో పలాస నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. పంటలకు నష్టపరిహారంతో పాటు ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు యాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, దాసరి తాతారావు పాల్గొన్నారు.
రోగులతో గౌరవ భావంతో మెలగాలి
ప్రతిరోగికితోనూ సిబ్బంది గౌరవభావంతో మెలిగి సేవలు అందించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సూచించారు పలాస ప్రభుత ్వ ఆసుపత్రికి కొత్త కమిటీ సభ్యులుగా ఎంపికైన దడియాల నర్సింహులు, సవర రాంబాబులను వైద్యులు, సిబ్బందికి ఆమె పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్ణీత సమయంలో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందిస్తే వారు కలకాలం గుర్తించుకుంటారన్నారు. ఫిర్యాదులు లేకుండా సేవలు అందించి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తొందరలోనే తీసుకు వస్తామని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.పాపినాయుడు మాట్లాడుతూ కొన్ని వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసుపత్రిలో మౌలిక సదుపాయల కొరత, జనరేటర్ సమస్య ఉందని, బెడ్లు తగిన విధంగా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రి నిధులతో వీటిని కొనుగోలు చేస్తామని, ఆపరేషన్లకు అవసరమ్యే సామాగ్రి కొనుగోలు చేయడానికి నిధులు సమకూర్చాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ తక్షణం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కొత్తగా ఎంపికైన సభ్యులు దడియాల నర్సింహులు, సవర రాంబాబులను వైద్యాధికారులు దుశ్సాలువలతో సత్కరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు కూన మోహన్‌బాబు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.