Tharjini Sivalingam: అమ్మో.. ఎంత ఎత్తో
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:47 AM
శ్రీలంక జాతీయ నెట్ బాల్ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ థర్జినీ శివలింగం సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో శ్రీలంక మహిళను ఆసక్తిగా చూసిన భక్తులు
శ్రీలంక జాతీయ నెట్ బాల్ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ థర్జినీ శివలింగం సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్‌లోనూ, ఆలయంలోనూ, బయటా ఆమె నడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా తలలు పైకెత్తి చూశారు. అందుకు కారణం ఆమె దాదాపు ఏడు అడుగుల పొడవు (6 అడుగుల 10.5 అంగుళాలు) ఉండటమే. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు కొందరు పోటీపడ్డారు.