Share News

Deputy CM Pawan Kalyan: మహామండపంలోకి ప్రవేశిస్తున్న భావన కలగాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:37 AM

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు కాలినడకన తిరుమలకు వచ్చిన సందర్భంలో అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణంపై చర్చించుకున్నాం.

Deputy CM Pawan Kalyan: మహామండపంలోకి ప్రవేశిస్తున్న భావన కలగాలి

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు కాలినడకన తిరుమలకు వచ్చిన సందర్భంలో అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణంపై చర్చించుకున్నాం. ఈ క్రమంలో బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుపతి నుంచి తిరుమల వరకు ప్రతి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నా. ట్రాఫిక్‌ సమస్య తగ్గించడంతో పాటు ఓ మహా మండపంలోకి ప్రవేశిస్తున్నామనే భావన భక్తులందరికీ కలిగేలా అలిపిరి ఆర్చిని డిజైన్‌ చేయాలనుకుంటున్నాం. అలాగే ప్రస్తుతం ఇండోనేషియా స్టైల్‌లో ఉన్న ఎయిర్‌పోర్టును కూడా తిరుమల క్షేత్రం భావన కలిగేలా తీర్చిదిద్దాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఇప్పటికే నా మైండ్‌లో డిజైన్‌ సిద్ధమైంది. ఇక పేపర్‌పై పెట్టడమే. పూర్తయిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ చైర్మన్‌కు చూపించి పనులు ప్రారంభిస్తాం. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికీ భూలోక వైకుంఠంలో ఉన్నామా అనే ప్రత్యేక అనుభూతులను కల్పించేలా ఈ డిజైన్లు ఉంటాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

- ఆనంద్‌సాయి, టీటీడీసభ్యుడ

Updated Date - Jun 21 , 2025 | 06:40 AM