Rooftop Solar: రూఫ్‌టాప్ సోలార్‌ను వేగవంతం చేయండి
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:38 AM
ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలతోపాటు నాబార్డ్ ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సోలార్ రూఫ్‌టాప్ ఇన్వె్‌స్టమెంట్ ప్రోగ్రాంను నిర్ణీత సమయానికి పూర్తి...
డిస్కంలు, ఏడీబీ, నాబార్డు అధికారులతో సమీక్ష
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలతోపాటు నాబార్డ్-ఏడీబీ(ఆసియా అభివృద్ధి బ్యాంకు) సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సోలార్ రూఫ్‌టాప్ ఇన్వె్‌స్టమెంట్ ప్రోగ్రాంను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. మంగళవారం సచివాయంలో డిస్కంల సీఎండీలు శివశంకర్, పృథ్వీతేజ్, పుల్లారెడ్డితోపాటు ఏడీబీ, నాబార్డ్ ప్రతినిధులతో సీఎస్ వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో హరిత ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను వేగంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.