Share News

ముత్యాల ముగ్గులకు విశేష స్పందన

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:00 AM

మదనపల్లె లో ఆంధ్రజ్యోతి-ఏబీఎన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది.

ముత్యాల ముగ్గులకు విశేష స్పందన
మదనపల్లె జడ్పీ హైస్కూల్‌లో ముగ్గులు ముగ్గులను పరిశీలిస్తున్న న్యాయనిర్ణేతలు, అతిథులు పద్మావతి, సుభద్ర, పి.తులసీ, ఎస్‌.ఎ.నస్రీనతాజ్‌వేస్తున్న మహిళలు

మదనపల్లె, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మదనపల్లె లో ఆంధ్రజ్యోతి-ఏబీఎన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఇందుకు స్థానిక జడ్పీ ఉన్న త పాఠశాల వేదికైంది. రంగువల్లులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇందులో మదనపల్లెతోపాటు పీలేరు, పుంగనూరు, బి.కొత్త కోట, తంబళ్లపల్లె చెందిన 76 మంది మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు..సం తూర్‌ ముత్యాల ముగ్గులపోటీలు..గార్డెనింగ్‌ పార్ట నర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌..ఫ్యాషన పార్టనర్‌ డిగ్‌సె ల్‌ వారి సెల్సియా(ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయి. ఇందులో భా గంగా ఈ పోటీలకు స్థానిక జ్ఞానాంభిక డిగ్రీ కళాశాలలు, ఆర్‌.కె.జ్యువెలర్స్‌, ఎస్‌.ఎ.నస్రీనతాజ్‌ లు స్పాన్సర్స్‌గా వ్యవహరించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన రంగువల్లుల పోటీలు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ జరిగా యి. ఈ పోటీలలో మదనపల్లెకు చెందిన వి.రెడ్డి రాణి 33 పాయింట్లతో ప్రథమబహుమతి, మదన పల్లెకు చెందిన ఎ.పద్మ 32 పాయింట్లతో రెండో బహుమతి, పట్టణానికే చెందిన వి.రెడ్డిరాజేశ్వరి 29 పాయింట్లతో తృతీయ బహుమతి కైవసం చేసుకున్నారు. వారికి ప్రథమ బహుమతి కింద రూ.6వేల విలువైన గ్యాస్‌స్టవ్‌, ద్వితీయ బహుమ తి కింద రూ.4వేల విలువ చేసే మిక్సీ, తృతీయ బహుమతి కింద రూ.3వేల విలువ చేసే పానసె ట్‌ ప్రదానం చేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో 76 మంది మహిళలు, విద్యార్థినులు పాల్గొనగా, వారిలో మిగిలిన 73 మందికీ ప్రార్టీస్‌పెన్స కింద టీ కప్పులసెట్‌ అందజేశారు. ఈ ముత్యాల ము గ్గ్గుల పోటీలకు ముఖ్యఅథితిగా మున్సిపల్‌ కమిష నర్‌ కె.ప్రమీల, స్పాన్సర్స్‌ జ్ఞానాభింక డిగ్రీ కళాశా ల అధినేత డాక్టర్‌ రాటకొండ గురుప్రసాద్‌, ఆర్‌.కె.జువెలర్స్‌ అధినేత పచ్చిపాల తులసి, ఎస్‌ఏ నస్రీనతాజ్‌లు హాజరయ్యారు. అలాగే న్యా యనిర్ణేతలుగా నిమ్మపల్లె మండల ఎంఈవో ఎం ఆర్‌పద్మావతి, గ్రామజ్యోతి స్వచ్చంధ సంస్థ నిర్వా హకురాలు బి.సుభద్ర, వ్యాఖ్యాతగా బాస్‌ వ్యవ స్థాపక, అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్‌ వ్యవహ రించారు. విజేతలకు మొదటి బహుమతిని మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీల, రెండో బహుమ తిని ఆర్‌.గురుప్రసాద్‌, తృతీయ బహుమతిని ఆర్‌.కె.జ్యువెలర్స్‌ పి.తులసీ, కన్సోలేషన బహుమ తులను ఎస్‌.ఎ.నస్రీనతాజ్‌ చేతులు మీదుగా అందజేశారు.

సంప్రదాయాలను

గుర్తుచేసేదే సంక్రాంతి

మదనపల్లె, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మన సం స్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసేదే సంక్రాంతి పండుగని మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీల పేర్కొ న్నారు. స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశా లలో ఆదివారం ఆంధ్రజ్యోతి-ఏబీఎన ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిష నర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరిగేదని, కొత్తగా వేసిన పంట ఇంటికి రావడం, హరిదాసులు, ముగ్గులు, గొబ్బె మలు మాచిన్న తనంలో ఉండేవి. ప్రస్తుతం అవ న్నీ చాలా వరకు కనుమరుగయాన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న టెక్నాలజీ, అర్బనై జేషన కారణాలుగా కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఏబీఎన-ఆంధ్రజ్యోతి ఇలాంటి కార్యక్ర మాలు నిర్వహించడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా స్పాన్సర్‌ రాటకొండ గురుప్రసాద్‌ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతున్న నేపథ్యంలో ఏబీఎన-ఆంధ్రజ్యోతి ముందస్తు సం క్రాంతి వేడుకలు నిర్వహించడాన్ని కొనియాడారు. ఇక్కడ మహిళలు వేసిన రంగవల్లులు చూస్తే ఇక్కడే సంక్రాంతి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ మహిళలు వేసిన ముగ్గులు పండుగ విశిష్టతను తెలియజేస్తాయని గురుప్రసాద్‌ పేర్కొన్నారు. అనంతరం వ్యాఖ్యాత బాస్‌ అధినేత పీటీఎం శివప్రసాద్‌, స్పాన్సర్‌ ఆర్‌.కె. జ్యువెలర్స్‌ అధినేత్రి పచ్చిపాల తులసి, న్యాయ నిర్ణేతలు ఎంఆర్‌ పద్మావతి, బి.సుభద్ర, ఎస్‌.ఎ.నస్రీనతాజ్‌లు సం క్రాంతి పండుగ విశిష్టత, సంస్కృతి, సాంప్రదా యాలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యఅతిథితోపాటు స్పాన్సర్స్‌, న్యాయనిర్ణేతలను ఆంధ్రజ్యోతి-ఏబీఎస్‌ సిబ్బంది జ్ఞాపికను అందజే శారు. మరోవైపు ఆది నుంచీ కార్యక్రమ నిర్వహ ణకు సహకరించిన మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీ ల, శానిటరీ ఇనస్పెక్టర్లు వెంకటసుబ్బయ్య, రెడ్డెప్ప, జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యా యుడు సుబ్బారెడ్డి, మాజీకౌన్సిలర్‌ ఎన.బాలగం గాధర్‌రెడ్డికి స్థానిక ఆంధ్రజ్యోతి-ఏబీఎన సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 12:00 AM