Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు అలెర్ట్..
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:15 PM
మొన్నటి వరకూ తీవ్ర మోంథా తుఫాన్ ప్రభావంతో తల్లడిల్లిన తెలుగురాష్ట్రాల వాసులకు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ..
అమరావతి, నవంబర్ 19: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. శనివారం(22వ తేదీ) నాటికి ఏర్పడి, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
దీని ప్రభావం వల్ల గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వాహణ సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
టీవీకే సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..