త్వరలో చెరువులకు నీరు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:20 AM
హంద్రీ, నీవా సుజల స్రవంతి పథకం ద్వారా త్వరలో చెరువులకు నీరు నింపుతామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

- డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
ప్యాపిలి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): హంద్రీ, నీవా సుజల స్రవంతి పథకం ద్వారా త్వరలో చెరువులకు నీరు నింపుతామని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏనుగమర్రి, వెంగళాంపల్లి, ప్యాపిలి, కలచట్ల, గుడిపాడు, ఊటకొండ గ్రామాల్లోని చె రువులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ డోన నియోజకవర్గంలో 38 చెరువులకు నీరందించనున్నట్లు తెలి పారు. ఇప్పటికే ప్యాపిలి, డోన మండలాల్లో 28 చెరువులకు నీరు నింపా మని త్వరలో మిగిలిన చెరువులకు నీరు సరఫరా చేస్తామని తెలిపారు. తద్వారా నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నా గేశ్వరరావు, నాయకులు రాజా నారాయణమూర్తి, టి శ్రీనివాసులు, ఏనుగమర్రి రామక్రిష్ణ, అలేబాదు పరమేష్, తూర్పు లింగారెడ్డి, ఆర్‌ఈ నాగరాజు, మోపూరి రాము,కేసీ మద్దిలేటి, రామ్మోహనయాదవ్, ఖాజాపీర్, శ్రీకాంత, రమేష్‌రెడ్డి, జయశీలమ్మ, కలచట్ల ప్రసాద్, చల్లా వీరాంజినేయులు, మధుకుమార్, రాజారవి, సూర్యనారాయణగౌడు, శంకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చెరువులను ఎమ్మెల్యే కోట్ల పరిశీలన
డోన రూరల్: మండలంలోని అభిరెడ్డిపల్లె చెరువు, దేవరబండ గ్రామ చెరువులను డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుధవారం పరిశీ లించారు. చెరువుల నీటి సామర్థ్యం గురించి ఇరిగేషన అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే కోట్ల వెంట టీడీపీ సీని యర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, మండల అధ్యక్షులు వెంకటనాయునిపల్లె శ్రీను, నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, సీలం భాస్కర్ నాయుడు, డీఎస్పీ పి.శ్రీనివాసులు, పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్ బాబు, ఎస్‌ఐలు శరత కుమార్ రెడ్డి, మమత తదితరులున్నారు.