Share News

చెత్త సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:16 AM

మండలంలోని మామిళ్లకుంట క్రాస్‌ రైల్వే స్టేషన ఎదురుగా కొత్తగా ఏర్పడిన కాలనీ వాసులు చెత్త సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడంతో ఈ కాలనీ ఏర్పడింది

చెత్త సమస్య పరిష్కరించండి
చెత్తకు నిప్పుపెట్టడంతో దట్టంగా వస్తున్న పొగ

కొత్తచెరువు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని మామిళ్లకుంట క్రాస్‌ రైల్వే స్టేషన ఎదురుగా కొత్తగా ఏర్పడిన కాలనీ వాసులు చెత్త సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు కొత్తగా ఇళ్లు నిర్మించుకోవడంతో ఈ కాలనీ ఏర్పడింది. కొత్తచెరువులో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో వేయకుండా పంచాయతీ సిబ్బంది ఈ కాలనీకి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ట్రాక్టర్లలో తీసుకువచ్చి వేస్తున్నారు. ఆ చెత్త పేరుకుపోయి కుళ్లి దుర్వాసన వస్తోందని, దోమలు, ఈగలు అధికమై రోగాలు పాలు అవుతున్నామని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆ చెత్తకు నిప్పుపెడుతుండటంతో భారీగా పొగ వస్తోందని, ఆ పొగ ఘాటుకు తట్టుకోలేకపోతున్నామని, కళ్లు మండుతున్నాయని వాపోతున్నారు. నిప్పురవ్వలు కూడా గాలిలో ఎగిరి వచ్చి ఇళ్లలోని సోపాలు, బట్టలపై పడుతుండటంతో.. అవి కాలుపోతున్నాయన్నారు. ఈ పొగ సమీపంలోని కొత్తచెరువు నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారి వైపు వెళ్తుండగా.. అనేక మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పొగ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడక పోవడంతో వాహనాలు ఢీకొని ఆస్పత్రులు పాలవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తను డంపింగ్‌ యార్డులో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 12:16 AM