Share News

Maha Kumbh Mela : మహా కుంభమేళాలో శ్రీవారికి స్నపన తిరుమంజనం

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:13 AM

మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌వద్ద గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.

 Maha Kumbh Mela : మహా కుంభమేళాలో శ్రీవారికి స్నపన తిరుమంజనం

తిరుమల, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌వద్ద గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం గంగా నది ఒడ్డున ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించింది. అనంతరం శ్రీచక్రత్తాళ్వార్‌ను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - Jan 17 , 2025 | 04:13 AM