Share News

Liquor Scam: లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు

ABN , Publish Date - May 14 , 2025 | 05:34 AM

లిక్కర్‌ స్కాం లో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడికి చెందిన ఆరు కంపెనీలపై సోదాలు నిర్వహించింది.

Liquor Scam: లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు

జగన్‌ ఓఎస్డీ కుమారుడి వ్యాపారాల్లో తనిఖీలు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణంలో మూలాలవరకూ చొచ్చుకెళ్లిన సిట్‌ అధికారులు, అంతిమ లబ్ధిదారు ఎవరనేది తేల్చే పనిలో ఉంది. అందులో భాగంగా జగన్‌ ఓఎ్‌సడీ కృష్ణమోహన్‌రెడ్డికి ఉచ్చు గట్టిగా బిగించడం మొదలైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆయన కుమారుడు రోహిత్‌రెడ్డికి చెందిన ఆరు కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో..1.రాజేంద్రనగర్‌ ఉప్పర పల్లిలోని సైన్‌ రైజ్‌ వ్యాలీలోని నాటికల్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 2. ఎస్‌ఆర్‌ నగర్‌లోని గౌతమి ధామమ్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న ఐబోట్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. 3.శేరిలింగంపల్లి మండలం గఫూర్‌నగర్‌లోని స్కూబీల్యాబ్స్‌ రోబోటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, 4.మెహదీపట్నంలోని క్రిస్టల్‌ గార్డెన్స్‌లోని క్రిస్టల్‌ మాన్షన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, 5. గుడిమల్కాపూర్‌ కింగ్‌ప్యాలెస్‌ పక్కనే ఉన్న ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెంచర్‌, 6.యాకూత్‌పురాలోని కార్యాలయం ఉన్నాయి. తెలంగాణకు చెందిన ఓ మంత్రి కుమారుడికి రోహిత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార భాగస్వామిగా ఉన్నట్లు సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:34 AM