జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:08 AM
చెన్నైలో ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఫారా స్పోర్ట్స్ పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం సాధించాలని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

కర్నూలు స్పోర్ట్స్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): చెన్నైలో ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఫారా స్పోర్ట్స్ పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం సాధించాలని రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. ఇటీవల మంగళగిరిలో నిర్వహించిన 6వ బెటాలియన క్రీడా మైదానంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన ఆఫ్ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలో జిల్లాకు 11 బంగారు, 8 సిల్వర్, 3 బ్రౌంజ్ మెడల్స్ సాధించారు. రాష్ట్ర విజేతలకు మంత్రి టీజీ భరత మెడల్స్ ప్రశంసాపత్రాలు అందజేశారు. జాతీయ స్థాయి పోటీలకు ఐదుగురు చెన్నైకు బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో స్టీఫెన హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన అధ్యక్షులు ఎల్లప్ప, రాష్ట్ర కార్యవర్గ సంఘం కార్యదర్శి రాజు, ఉపాధ్యక్షులు కుమ్మరి మద్దిలేటి, సహాయ కార్యదర్శి మక్బూల్ బాషా, కోశాదికారి సురేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, ఉపాధ్యాయుడు కృష్ణ, గణేష్, దినకర్, రేణు, మదన మోహన తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.