Sharmila Slams Jagan: నాడు కుప్పం.. నేడు పులివెందుల
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:58 AM
నాడు కుప్పంలో జగన్, నేడు పులివెందులలో చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని..
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్, చంద్రబాబు: షర్మిల
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నాడు కుప్పంలో జగన్, నేడు పులివెందులలో చంద్రబాబు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌కూ చంద్రబాబుకూ తేడాలేదన్నారు. స్వాతంత్వ్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ దేశాన్ని మోదీ చెర నుంచి విడిపించేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశాన్ని కార్పొరేట్లకు దోచిపెట్టి, ఆర్‌ఎ్‌సఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయడమేనా నయా భారత్ అని ప్రశ్నించారు.