Share News

Minister Kondapalli : ‘స్త్రీనిధి’ ద్వారా రుణాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:03 AM

రాష్ట్రంలో నిరక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్దఎత్తున రుణాలు ఇవ్వాల్సిన అవసరముందని, ఇందుకోసం స్త్రీనిధి విభాగం విస్తరణకు సిద్ధం కావాలని సెర్ప్‌ మంత్రి కొండపల్లి

 Minister Kondapalli  : ‘స్త్రీనిధి’ ద్వారా రుణాలు

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరక్ష్యానికి గురైన వెనుకబడిన వర్గాలకు స్త్రీనిధి ద్వారా పెద్దఎత్తున రుణాలు ఇవ్వాల్సిన అవసరముందని, ఇందుకోసం స్త్రీనిధి విభాగం విస్తరణకు సిద్ధం కావాలని సెర్ప్‌ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. బుధవారం విజయవాడలోని ఓ హోటల్‌లో స్త్రీనిధి వర్క్‌షాపును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీనిధి సేవాసంస్థ ద్వారా పేద ప్రజలకు రాబోయే రోజుల్లో రుణాల పంపిణీ మొత్తాన్ని పెంచుతామన్నారు. పొదుపు సంఘాలలో నిరుపయోగంగా ఉన్న నిధులను స్త్రీనిధిలో డిపాజిట్‌ చేసి మహిళలకు పెద్దమొత్తంలో రుణాలను అందించేందుకు వెలుగు 2.0లో భాగంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్‌ సీఈవో వాకాటి కరుణ, స్త్రీనిధి ఎండీ జీవీబీడీ హరిప్రసాద్‌, పలువురు డీజీఎంలు, 16 జిల్లాల ఏజీఎంలు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 05:04 AM