రుణాలకు అర్హులను ఎంపిక చేయండి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:40 PM
కూటమి ప్రభుత్వం యువతీ, యువకుల ఉపాధి కొరకు అంద జే స్తున్న స్వయం ఉపాధి రుణాలకు అర్హులైన లబ్ధి దారులను ఎంపిక చేయా లని టీఎనఎస్వీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, నియోజకవర్గ టీడీపీ నేత కట్టా దొరస్వామినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా సూచించారు.

ములకలచెరువు, ఫిబ్ర వరి 17(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం యువతీ, యువకుల ఉపాధి కొరకు అంద జే స్తున్న స్వయం ఉపాధి రుణాలకు అర్హులైన లబ్ధి దారులను ఎంపిక చేయా లని టీఎనఎస్వీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు, నియోజకవర్గ టీడీపీ నేత కట్టా దొరస్వామినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా సూచించారు. స్థానిక మండల ప్రజా పరిషత కార్యాలయంలో సోమవారం కార్పొరేషన రుణాల లబ్ధిదారుల ఎంపికపై ఎంపీడీవో హరినారాయణతో వారు చర్చించారు. రుణాల ఎంపిక లో జాగ్రత్తలు పాటించి, అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని, అనర్హుల కు రుణాలు ఇస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, టీడీపీ నేతలు చెన్నకిష్టా, కేశవులు, జేసీబీ సుధాకర్‌నాయుడు, నాయకులు రెడ్డెప్ప, భాస్కర్‌నాయుడు, ప్రతాప్, ప్రతాప్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.