Share News

వైభవంగా సాలీ బసయ్యస్వామి రథోత్సవం

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:43 PM

మండలంలోని మాధవరం గ్రామంలో సాలీ బసయ్యస్వామి రథోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు.

  వైభవంగా సాలీ బసయ్యస్వామి  రథోత్సవం
మాధవరంలో సాలీ బసయ్యస్వామి రథోత్సవం

మంత్రాలయం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరం గ్రామంలో సాలీ బసయ్యస్వామి రథోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఆదివారం బిచ్చాల మఠం పీఠాధిపతి వీరభధ్ర స్వామి ఆధ్వర్యంలో జంగం వీరన్నస్వామి, మఠం సూగయ్య స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి శివునికి, నందికి, శివలింగానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించి చూడముచ్చటగా అలంకరించారు. రథంపై రామలింగేశ్వరస్వామి, విఘ్నేశ్వరుడు, సాలీ బసయ్య స్వామి, శివలింగాలను ఉంచి ఊరేగించారు. రథం ముందుకు సాగుతుండగా నందికోళ్లు, కోలాటాలు, బాలికలు, బొమ్మలు ప్రత్యేక నృత్యాలు ఎంతగా నో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలను భక్తులు ఊరేగింపుగా తీసుకవచ్చి రథానికి వేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంచాల సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ప్రదీ్‌పరెడ్డి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన సీవీ విశ్వనాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ రాజశేఖర్‌రె డ్డి, మాజీ సర్పంచ రఘునాథరెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు అమర్‌నాథ్‌రెడ్డి, మిస్సల్‌ క్రాం తికుమార్‌ రెడ్డి, సాయికుమార్‌రెడి,్డ రాకే్‌షరెడ్డిలను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో నల్లగౌని రామకృష్ణారెడ్డి, గౌళ్ల నర్సిరెడ్డి, పైబావి వీరారెడ్డి, భీమిరెడ్డి, హనుమంతరెడ్డి, నరసన్న, నరసింహులు, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు. మాధవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Feb 09 , 2025 | 11:43 PM