Share News

RTE Admissions: 3కి.మీ. దాటినా ఆర్టీఈ అడ్మిషన్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 06:19 AM

విద్యాహక్కు చట్టం కింద అడ్మిష న్లు పొందేందుకు పాఠశాల విద్యాశాఖ మరింత వెసులుబాటు కల్పించింది.

RTE Admissions: 3కి.మీ. దాటినా ఆర్టీఈ అడ్మిషన్లు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం కింద అడ్మిష న్లు పొందేందుకు పాఠశాల విద్యాశాఖ మరింత వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పాఠశాల 3కిలోమీటర్ల లోపు ఉంటేనే ఆర్టీఈ కింద అడ్మిషన్‌ ఇస్తున్నారు. ఈ పరిధిని 5కిలోమీటర్ల వరకు పెంచుతూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త నోటిఫికేషన్‌ జారీచేసేందుకు సమగ్రశిక్షకు అనుమతిచ్చింది. పాఠశాలకు 3 నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఇళ్లు ఉన్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు కల్పించాలని స్పష్టం చేసింది. అయితే ఈ విద్యార్థుల తల్లుల్లో ఎవరికైనా ఇప్పటికే ‘తల్లికి వందనం’ డబ్బులు వచ్చి ఉంటే దాని నుంచే ఈ విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించాలనే నిబంధన పెట్టింది.

Updated Date - Aug 05 , 2025 | 06:19 AM