ఆర్టీసీ సేవలు ప్రశంసనీయం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:59 AM
సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ మాసోత్సవాలు ముగింపు సంద ర్భంగా ఏలూరులోని ఆర్టీసీ డిపోలో ఉత్తమ డ్రైవర్లకు బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు.

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సేవలు ఎంతో ప్రశంసనీయమని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థ మాసోత్సవాలు ముగింపు సంద ర్భంగా ఏలూరులోని ఆర్టీసీ డిపోలో ఉత్తమ డ్రైవర్లకు బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలకు అవార్డులను బహూకరించి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసేటప్పుడు విధిగా ఏకాగ్రతతో ఉండాల న్నారు. జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి ఎన్ వీఆర్ వర ప్రసాద్ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు తగ్గాయన్నారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్లు బి.వాణి, పవన్‌కుమార్, గంగాధర్, డిపోల ఏఎంపీలు, కార్మిక సంఘాల నాయకులు, పీఆర్వో నరసింహం తదితరులు పాల్గొన్నారు.
అవార్డు గ్రహీతలు వీరే..
జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలలో డ్రైవర్లలో ఇప్పటి వరకు వారి సీని యార్టీని బట్టి ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉత్తమ డ్రైవింగ్ చేసిన ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులను అందించారు. నూజివీడు డిపోకు చెందిన బి.పాపారావు (ప్రథమ), ఏలూరు డిపోనకు చెందిన జె.చెల్లయ్య (ద్వితీయ), జంగా రెడ్డిగూడెం డిపోనకు చెందిన బి.కృష్ణారెడ్డి (తృతీయ)లకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవా ర్డులను ఎస్పీ అందించారు. ఏలూరు డిపో పరిధిలో ఆర్‌వీరావు, పీవీవీవీ రావు, డీఆర్ కృష్ణలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డు లను అందించారు. జంగారెడ్డిగూడెం డిపో పరిధిలో బీవీఎస్‌ఎన్‌టీ రాజు, ఎం.చిన్నయ్య, ఎం,బాబూరావులకు ప్రథమ, ద్వితీయ, తృతీ య, నూజివీడు డిపో పరిధిలో డీవీకే రావు, బీవీ రావు, కేఆర్ కృష్ణలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు.