Minority Welfare: బడ్జెట్‌లో మైనార్టీలకు పెద్ద పీట
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:17 AM
పీఎం జన్ వికాస్ కోసం 560 కోట్లు, ముస్లిం మైనార్టీల స్వయం ఉపా ధి, ఆర్థిక భరోసాకు రూ.173.57 కోట్లు, ఆర్టీఎఫ్ అండ్ ఎండీఎఫ్‌కు రూ.229 కోట్లు, ఏపీజే కలాం ఓవర్సీస్ పథకానికి రూ.20 కోట్లు, ఇమామ్‌లు, మౌజన్ల వేతనాలకు రూ.90 కోట్లు, హజ్ యాత్రికులకు రూ.14 కోట్లు ఉర్దూ అకాడమీకి రూ.10.80 కోట్లు కేటాయించింది.
5,434 కోట్లు కేటాయింపు.. గతంకన్నా 1,058 కోట్లు అదనం
మైనార్టీ సబ్ ప్లాన్‌కు 2,512 కోట్లు
అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మైనార్టీల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,434 కోట్లు కేటాయించింది. ఇది గత ఏడాది కన్నా రూ.1058 కోట్లు అదనం. మైనార్టీ సబ్ ప్లాన్‌కు రూ.2,512 కోట్లు కేటాయించింది. పీఎం జన్ వికాస్ కోసం 560 కోట్లు, ముస్లిం మైనార్టీల స్వయం ఉపా ధి, ఆర్థిక భరోసాకు రూ.173.57 కోట్లు, ఆర్టీఎఫ్ అండ్ ఎండీఎఫ్‌కు రూ.229 కోట్లు, ఏపీజే కలాం ఓవర్సీస్ పథకానికి రూ.20 కోట్లు, ఇమామ్‌లు, మౌజన్ల వేతనాలకు రూ.90 కోట్లు, హజ్ యాత్రికులకు రూ.14 కోట్లు ఉర్దూ అకాడమీకి రూ.10.80 కోట్లు కేటాయించింది. క్రైస్తవ మైనార్టీ ఉపాధి ఆర్థిక చేయూతకు రూ.20 కోట్లు, పాస్టర్లకు రూ.30.49 కోట్లు కేటాయించింది. జెరుసలేం యాత్రికులకు రాయితీ కోసం రూ.1.50 కోట్లు, అంబేడ్కర్ ఓవర్సీస్ పథకానికి రూ.1.50 కోట్లు, ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎ్‌ఫకు రూ.12 కోట్లు కేటాయించింది. మైనారిటీల సంక్షేమ పథకాలకు గతంలో రూ.2808 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది అదనంగా మరో రూ.112.70 కోట్లు కేటాయించారు.