Minister Farooq: హజ్ యాత్రికుల ఖాతాల్లో రూ.లక్ష జమ
ABN , Publish Date - Aug 07 , 2025 | 05:12 AM
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకొని హజ్ యాత్ర 2025 చేసిన
మంజూరైన 24 గంటల్లోనే చెల్లింపులు పూర్తి : మంత్రి ఫరూక్
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకొని హజ్ యాత్ర-2025 చేసిన యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వం చెల్లించింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 72 మందికి మొత్తం రూ.72 లక్షలు మంజూరు చేసిన 24 గంటల వ్యవధిలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హజ్-2026లోనూ విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి బయలుదేరే యాత్రికులందరికీ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యంగా ఎన్నుకోవాలని కోరారు.