Share News

Borugadda Anil: సీఐని బెదిరించిన కేసులో బోరుగడ్డకు రిమాండ్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:19 AM

సీఐను బెదిరించిన కేసులో రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం మొబైల్‌ కోర్టు రిమాండ్‌కు తరలించింది. సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై వ్యాఖ్యల కేసును సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేశారు.

Borugadda Anil: సీఐని బెదిరించిన కేసులో బోరుగడ్డకు రిమాండ్‌

తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలింపు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): సీఐని బెదిరించిన కేసులో రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. అనంతపురం త్రీటౌన్‌ సీఐ మురళీకృష్ణను 2018లో బెదిరించిన ఘటనలో బోరుగడ్డపై కేసు నమోదయింది. ఆ కేసు విచారణ శుక్రవారం అనంతపురం మొబైల్‌ కోర్టులో సాగింది. అనంతపురం రామచంద్ర నగర్‌లోని ఓ క్రైస్తవ సంస్థ సభ్యుల మధ్య గొడవల నేపథ్యంలో భద్రత కావాలంటూ నాటి సీఐ మురళీకృష్ణను 2018, జూలై 21 కోరారు. వారి అభ్యర్థన మేరకు అప్పటి ఎస్‌ఐ క్రాంతికుమార్‌, సిబ్బందిని సీఐ పంపించారు. అదే రోజు సాయంత్రం ఆయనకు రెండు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. అసభ్యకరంగా మాట్లాడారు. ఒక వర్గానికి మద్దతు ఇవ్వాలంటూ హుకూం జారీ చేశారు. పోలీసుల విచారణలో తాతోటి జాకోట్‌ స్వరూప్‌ కుమార్‌ పేరు మీద బోరుగడ్డ అమృతవల్లి సిమ్‌ కార్డులు తీసుకున్నట్లు రుజువయింది. దీనిపై సీఐ మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో అదే ఏడాది జూలై 26న కేసు నమోదైంది. ఈ కేసులో బోరుగడ్డ అనిల్‌ను రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చాక బోరుగడ్డ ఇప్పటి వరకు వాయిదాలకు హాజరు కాలేదు. దీంతో అనంతపురం మొబైల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురం పోలీసులు రాజమహేంద్రవరం జైలు నుంచి అతన్ని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చారు. శుక్రవారం 11 గంటల సమయంలో మొబైల్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయాధికారి అతనికి రిమాండ్‌ విధించారు. విచారణను 10వ తేదీకి వాయిదా వేశారు. ఏ జైలుకు వెళతావు? అని న్యాయాధికారి ప్రశ్నించగా...‘రాజమహేంద్రవరం జైలుకే పంపండి’ అని అనిల్‌ కోరారు. దీంతో బోరుగడ్డను ఆ జైలుకు తరలించారు.


సెషన్స్‌ కోర్టుకు బదిలీ...

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను దూషించిన ఘటనపై అనంతపురం 4వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇదివరకు బెయిల్‌ ఇవ్వకూడదని పోలీసులు కోర్టును కోరారు. శుక్రవారం మరోసారి ఎక్సైజ్‌ కోర్టులో బోరుగడ్డను హాజరు పరిచారు. ఈ కేసును న్యాయాధికారి సెషన్స్‌ (మహిళా) కోర్టుకు బదిలీ చేశారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:19 AM