Share News

Minister Pemmassani: ప్రతీ 400 రోడ్డు ప్రమాదాల్లో 250 మంది మృతి

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:10 AM

బుధవారమిక్కడ రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు-2025లో ఆయన పాల్గొన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు నడిపిన ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ ధరించి పెమ్మసాని ప్రయాణించారు.

 Minister Pemmassani: ప్రతీ 400 రోడ్డు ప్రమాదాల్లో 250 మంది మృతి

ఆయుధం కన్నా వాహనాన్ని జాగ్రత్తగా వాడాలి

హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ వాడనందుకే మరణాలు: పెమ్మసాని

గుంటూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఆయుధాన్ని వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో వాహనాన్ని నడిపేటప్పుడూ అంతే జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారమిక్కడ రవాణా శాఖ నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాలు-2025లో ఆయన పాల్గొన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు నడిపిన ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ ధరించి పెమ్మసాని ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి 400 రోడ్డు ప్రమాదాల్లో 250 మందికిపైగా మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్మెట్లు, సీట్‌బెల్టులు వాడకపోవడం వల్లే 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. హెల్మెట్‌ వాడితే జుట్టు ఊడిపోతుందనేది అపోహేనని అన్నారు. రేసుల జోలికి వెళ్లవద్దని యువతను కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్‌కుమార్‌, జీఎంసీ కమిషనర్‌ పులి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, ఏపీటీఎస్‌ చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:33 AM