Rice Exports Halted: బియ్యం ఎగుమతులకుబ్రేక్
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:35 AM
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల తహశీల్దార్ కార్యాలయం...
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీ్‌సస్టేషన్, సబ్‌ట్రెజరీ సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వర్షం నీటితో జలదిగ్బంధంలో ఉన్నాయి. కాకినాడ నగరంలోనూ రహదారులు నీటమునిగాయి. అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు బీచ్‌రోడ్డును తాకాయి. సముద్రంలోనూ అలల తీవ్రత అధికంగా ఉండడంతో కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులకు బ్రేక్ పడింది. నాలుగు షిప్పుల్లోకి బియ్యం లోడింగ్ నిలిచిపోయింది. కాకినాడ, తూర్పుగోదావరి కలెక్టరేట్‌లతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. గోదావరి లంకల్లోని నివాసితులను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.