SRDS: ఎవరు తప్పు చేస్తే.. వారిపైనే చర్యలు!
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:08 AM
ఉపాధి హామీ పథకం సిబ్బందికి సంబంధించి సొసైటీ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ సర్వీ్‌స(ఎ్‌సఆర్‌డీఎస్) నిబంధనలను సవరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తోంది.

ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఊరట
చేయని తప్పుకు శిక్ష పడకుండా చర్యలు
ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో మార్పులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ యోచన
అమరావతి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం సిబ్బందికి సంబంధించి సొసైటీ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ సర్వీ్‌స(ఎ్‌సఆర్‌డీఎస్) నిబంధనలను సవరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తోంది. తప్పు చేయని వారిపై చర్యలు తీసుకోకుండా.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగితే.. ఏ కేటగిరి సిబ్బందికి ఏ విధమైన జవాబుదారీతనం ఉండాలన్న దానిపై ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు. 2008లో రూపొందించిన రూల్స్ చాలా వరకు కాలం చెల్లినవే! సోషల్ ఆడిట్ తర్వాత వీటిని పాటించడం ద్వారా.. అవినీతికి పాల్పడకపోయినా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు! ఈ నేపథ్యంలో సిబ్బంది జాబ్‌చార్ట్‌పై మరింత స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలను మార్పుచేసేందుకు జిల్లాల డ్వామా పీడీల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. కమిషనర్ కృష్ణతేజ గురు, శుక్రవారాల్లో విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశాల్లోనే డ్వామా పీడీల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముక్‌కుమార్ నిర్ణయించారు. ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో లోపాలను సరిదిద్ది వచ్చే ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు సమావేశంలో సవరణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
బాధ్యతలు లేని ఏపీఓలు
ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పలు బాధ్యతలు అప్పగించారు. అవినీతి జరిగితే ఏయే సిబ్బంది ఎంత మేరకు బాధ్యత వహించాలన్న దానిపై అప్పట్లో మార్గదర్శకాలు రూపొందించారు. ఉపాధి పథకంలో ఏపీఓ కీలకంగా వ్యవహరిస్తుంటారు. మండలంలో పథకం అమల్లో పీఓకు సహకరిస్తూ కీలకంగా పర్యవేక్షిస్తుంటారు. అయితే సోషల్ ఆడిట్ ద్వారా వెల్లడైన నిరూపణల్లో ఏపీఓలను బాధ్యులుగా చేసే పరిస్థితి ఎస్‌ఆర్‌డీఎస్ రూల్స్‌లో లేవు. ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్ రూ.10 వేలకు పైగా అవినీతికి పాల్పడినట్లు సోషల్ ఆడిట్ నివేదిస్తే.. వారిని వెంటనే సస్పెండ్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.25 వేల కంటే ఎక్కువగాను, ఏపీఓ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌కు రూ.50 వేలు దాటితే చర్యలు తీసుకుంటారు. చేసిన పనుల కొలతల విషయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లను మాత్రమే బాధ్యులను చేస్తారు. పని జరగకుండా టెక్నికల్ అసిస్టెంట్లు రికార్డు చేసి మస్టర్లు వేస్తే.. దానికి టెక్నికల్ అసిస్టెంట్లను, చెక్ మెజర్‌మెంట్ చేసినందుకు ఇంజనీరింగ్ కన్సల్టెంట్లను బాధ్యులను చేస్తారు. కొన్ని చోట్ల జరిగిన పనులు కనుమరుగవుతున్నందున టీఏ, ఈసీలు కారణం లేకుండా బాధితులవుతున్నారు. ఒక పొలంలో తవ్విన ఫారం ఫాండ్‌ను రైతు ఏడాదిలో పూడ్చేస్తే.. దానికీ సిబ్బంది బాధ్యులవుతున్నారు. ఇలా పలు కారణాలతో తప్పులు చేయని సిబ్బందిని బాధ్యులను చేస్తున్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News