డ్రైనేజీల్లో పూడిక తొలగింపు
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:43 PM
స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది

ధర్మవరం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): స్థానిక స్పందన ఆస్పత్రి నుంచి లక్ష్మీచెన్నకేశవపురం వరకు ప్రధాన రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ పూడుకుపోయింది. దీంతో వర్షాలు వచ్చినప్పుడల్లా మురుగునీరు రోడ్లపై పారుతూ తీవ్ర అసౌకర్యానికి కల్గించేది. ఈ పరిస్థితి ఐదేళ్లుగా ఉంది. ఈ విషయాన్ని స్థానికులు నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో పూడి పోయిన ఆ డ్రైనేజీలను శుభ్రం చేయించేలా చూడాలని ఆ వార్డు టీడీపీ ఇనచార్జి భీమనేని ప్రసాద్‌నాయుడికి సూచించారు. ఆయన మున్సిపాలిటీ శానిటరీ ఇనస్పెక్టర్ కేశవ, సచివాలయ శానిటరీ సెక్రటరీ పుష్పరాజ్‌తో కలిసి.. సిబ్బందితో ఆ డ్రైనేజీల్లో పూడికను బుధవారం తొలగించారు.