Share News

Vamsi PSR Remand: వంశీ, పీఎస్‌ఆర్‌లకు రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - May 08 , 2025 | 05:34 AM

గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వంశీ, కాదంబరి కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులకు రిమాండ్‌ ఈ నెల 21 వరకు పొడిగించారు. వంశీ అనుచరుడు రంగా, ప్రశాంత్‌లకు బెయిల్‌ మంజూరైంది

Vamsi PSR Remand: వంశీ, పీఎస్‌ఆర్‌లకు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, మే 7(ఆంధ్రజ్యోతి): వేర్వేరు కేసుల్లో విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు రిమాండ్‌లను న్యాయస్థానం పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని బుధవారం విజయవాడలోని మూడో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అదేవిధంగా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుకు సంబంధించి పీఎ్‌సఆర్‌ ఆం జనేయులునూ ఇదే కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ ఈ నెల 21 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి పి.తిరుమలరావు ఆదేశాలిచ్చారు.


వంశీ అనుచరుడు రంగాకు బెయిల్‌

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీమోహన్‌ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్‌ రంగా, 89వ నిందితుడు ప్రశాంత్‌లకు విజయవాడ 12వ ఏడీజే కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - May 08 , 2025 | 05:34 AM