తగ్గిన వేరుశనగ ధర
ABN , Publish Date - Feb 18 , 2025 | 11:53 PM
రబీలో బోరుబావుల కింద రైతులు సాగుచేసిన వేరుశనగ దిగుబడి రాగానే మార్కెట్‌లో ధర ఒక్కసారిగా పడిపోయింది. విత్తన సమయంలో 42కేజీల బస్తా రూ.3,200 నుంచి 3,500తో రైతులు కొనుగోలు చేసి పంటలు సాగుచేశారు.
నంబులపూలకుంట, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రబీలో బోరుబావుల కింద రైతులు సాగుచేసిన వేరుశనగ దిగుబడి రాగానే మార్కెట్‌లో ధర ఒక్కసారిగా పడిపోయింది. విత్తన సమయంలో 42కేజీల బస్తా రూ.3,200 నుంచి 3,500తో రైతులు కొనుగోలు చేసి పంటలు సాగుచేశారు. పంట విత్తన సమయంలో అధికంగా వర్షాలు కురవడంతో కలుపు అధికం కావడంతో కూలీల ఖర్చు పెరిగింది. ఎకరా వేరుశనగ కలుపు తీయడానికి రూ. పదివేలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోయినా, పండి పంటను విక్రయించి, చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి రైతులు కాయలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ధరలు తగ్గిపోయాంటూ వ్యాపారులు దాట వేస్తున్నారు. అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది రైతులు వచ్చిన కాడికి విక్రయి స్తున్నారు. 45.500 కేజీలు రూ.2,400 నుంచి 3.600 వరకు మార్కెట్‌లో ధర ఉంది. విత్తన నాణ్యతను బట్టీ ధరలు వ్యాపారులు ధర నిర్ణయి స్తున్నారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్నచందంగా రైతుల పరిస్థితి తయారైంది. ప్రభుత్వమే తాము పండించిన వేరుశగను కొనుగోలు చేయాలని కోరుతున్నారు.