Share News

ఎల్‌ఐసీలో నియామకాలు చేపట్టాలి

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:34 AM

ఎల్‌ఐసీలో నియామకాలు చేపట్టాలని ఆ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

ఎల్‌ఐసీలో నియామకాలు చేపట్టాలి
కదిరి: నిరసన వ్యక్తం చేస్తున్న ఎల్‌ఐసీ ఉద్యోగులు

కదిరిఅర్బన, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఐసీలో నియామకాలు చేపట్టాలని ఆ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. బీమా రంగం రూపు రేఖలు మారిపోతున్నాయని, కావున ఉన్నత విద్యావంతులు, సాంకేతిక పరిజ్ఞానమున్న యువతను ఉద్యోగులుగా నియమించాలన్నారు. యూపీఎ్‌సఈ తరహాలో ఏటా ఎల్‌ఐసీలో నియామకాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన నాయకులు శ్రీనివాసులు, గంగాధర్‌, శివభారతి, నవీనకుమార్‌, రామక్రిష్ణ, రఘు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 12:34 AM