Real Estate Cheating: అమరావతిలో రియల్ చీటింగ్
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:32 AM
అమరావతి ప్రాంతంలో 95 సెంట్ల పొలాన్ని విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి నకిలీ పత్రాలు చూపించి ఎన్‌ఆర్‌ఐ మహిళ నుంచి రూ.16 లక్షలు స్వాహా చేశాడు. గుంటూరు నగరంలోని శ్యామలనగర్‌కు చెందిన....
నకిలీ పత్రాలతో ఎన్నారై మహిళకు టోకరా
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
గుంటూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో 95 సెంట్ల పొలాన్ని విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి నకిలీ పత్రాలు చూపించి ఎన్‌ఆర్‌ఐ మహిళ నుంచి రూ.16 లక్షలు స్వాహా చేశాడు. గుంటూరు నగరంలోని శ్యామలనగర్‌కు చెందిన హసీనా యూర్‌పలో ఉంటున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లు గ్రామంలోని 95 సెంట్ల పొలాన్ని విక్రయిస్తానంటూ అమరావతికి చెందిన టీడీపీ నాయకుడు జాన్ సైదా మధ్యవర్తి గోపి ద్వారా ఆమెను సంప్రదించాడు. కంచేటి కుక్క మల్లేశ్వరయ్య నుంచి తాను ఆ పొలాన్ని కొనుగోలు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నానంటూ ఓ నకిలీ అగ్రిమెంట్ సృష్టించి ఆమెకు చూపించాడు. గుంటూరు నగరం ఆర్ అగ్రహారంలో నివసిస్తున్న ఆమె సోదరి జాన్‌బీని ఆ పొలానికి తీసుకెళ్లి చూపించారు. రూ.75.52 లక్షలకు ఆ పొలాన్ని కొనేందుకు అంగీకరించిన హసీనా అడ్వాన్సుగా రూ.16 లక్షలు చెల్లించారు. నెల వ్యవధిలో మిగిలిన డబ్బు చెల్లించి రిజిరేస్టషన్ చేయించుకునేలా తన సోదరి జాన్‌బీ పేరున మే 15న అగ్రిమెంటు రాయించుకున్నారు. జూన్ 20న గుంటూరుకు వచ్చిన హసీనా రిజిస్ర్టేషన్ చేయించేందుకు రావాలని జాన్ సైదాను కోరగా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నాడు. దీంతో హసీనాకు అనుమానం వచ్చి నెమలికల్లు వెళ్లి మాజీ సైనికుడు కంచేటి కుక్క మల్లేశ్వరయ్యను సంప్రదించారు. జాన్‌సైదా ఎవరో తనకు తెలియదని, తాను అతనికి అగ్రిమెంట్ రాయలేదని మల్లేశ్వరయ్య చెప్పడంతో బాధితురాలు శనివారం రాత్రి పట్టాభిపురం పోలీస్ ేస్టషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులకు, ఆన్‌లైన్‌లో సీఎంవోకు కూడా ఫిర్యాదు పంపారు.