Rayapati Shailaja: పార్టీలకు అతీతంగా మహిళలకు అండ
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:01 AM
పార్టీలకు అతీతంగా మహిళలకు అండగా ఉంటామని, బాలికలకు, మహిళలకు అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ
ఏలూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా మహిళలకు అండగా ఉంటామని, బాలికలకు, మహిళలకు అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా చిత్రీకరించే వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. ఏలూరు జిల్లాలో గురువారం ఆమె విస్తృతంగా పర్యటించారు. హనుమాన్ జంక్షన్‌లో శక్తిసదన్‌ను, ముసునూరులో గురుకుల పాఠశాలను పరిశీలించారు. వాటి అభివృద్ధికి సూచనలు చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్‌స్టాప్ సెంటర్‌ను తనిఖీ చేశారు.