TDP event: మహా రుచులు
ABN , Publish Date - May 28 , 2025 | 05:44 AM
మహానాడులో రాయలసీమ వంటలు, గోంగూర చికెన్ వంటి ప్రత్యేక భోజనాలు ఆకట్టుకున్నాయి. అయితే జనరల్ భోజనశాలలో గందరగోళం తలెత్తగా, చంద్రబాబు-లోకేశ్ 45 అడుగుల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టీడీపీ ప్రతినిధులకు నోరూరించే రాయలసీమ వంటలు
తొలిరోజు 70 వేల మందికి భోజనాలు
కడప రూరల్, మే 27(ఆంధ్రజ్యోతి): మహానాడులో రాయలసీమ రుచులతో చక్కటి వంటలను తయారు చేశారు. ఫేమస్ స్వీట్లతోపాటు రకరకాల వెజ్, ఎగ్, చికెన్, మటన్ ఐటమ్స్‌తో భోజనాలు ఏర్పాటు చేశారు. రాయలసీమ స్పెషల్ అట్రాక్షన్‌గా గోంగూర చికెన్ కూడా సిద్ధం చేశారు. 1500 మంది నిపుణులతో వంటలు చేయిస్తున్నారు. తొలిరోజు 50 నుంచి 70 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వంటకాలను అంబికా క్యాటరింగ్ ఈవెంట్ ఆర్గనైజర్ కిరారు వెంకట శివాజీ చూస్తున్నారు. 2014 నుంచి ప్రతి మహానాడులోనూ ఈయనే వంటలు చేస్తున్నారు. కాగా, మహానాడుకు వచ్చినవారికి స్టేజి సభ్యుల (వీవీఐపీ) భోజన శాల, వీఐపీ భోజనశాల, మీడియా భోజనశాల, జనరల్ కేటగిరీ ఇలా నాలుగు రకాల భోజన శాలలు ఏర్పాటు చేశారు. తొలిరోజు జనరల్ కేటగిరీ భోజన శాలకు కార్యకర్తలు తరలివెళ్లి.. క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో గందరగోళం చోటుచేసుకుంది. ప్లేట్లు చాలక.. సమయానికి భోజనం అందక కాసేపు కార్యకర్తలు అవస్థలు పడ్డారు.
ఆకట్టుకుంటున్న చంద్రబాబు, లోకేశ్ కటౌట్లు
మహానాడు సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ వన్‌టౌన్‌లోని కెనాల్ రోడ్డులో ఏర్పాటు చేసిన కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్ 45 అడుగుల కటౌట్లను ఏర్పాటు చేశారు.
- విజయవాడ,ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News