Share News

Ratnakar: పీఆర్‌జీఐ కార్యకలాపాలు సమన్వయం చేస్తా

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:48 AM

రాష్ట్రంలోని పీఆర్‌జీఐకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రచార కార్యకలాపాలు..

Ratnakar: పీఆర్‌జీఐ కార్యకలాపాలు సమన్వయం చేస్తా

  • మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ రత్నాకర్‌

విజయవాడ(కృష్ణలంక), జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పీఆర్‌జీఐకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రచార కార్యకలాపాలు, క్షేత్ర ప్రచార కార్యకలాపాలు, ప్రింట్‌ మీడియా సంస్థలకు సంబంధించిన వివిధ కార్యకలాపాలను సమన్వయం చేస్తానని విజయవాడలోని పత్రికా సమాచార కార్యాలయం మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పి.రత్నాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌, రిజిస్ర్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌జీఐ) డిప్యూటీ ప్రెస్‌ రిజిస్ర్టార్‌ జనరల్‌గా కూడా ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 03:48 AM