Share News

ఇంటి వద్దకే రేషన అందించాలి

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:23 AM

ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి రేషన సరుకులు అందించాలని స్టోర్‌ డీలర్లకు, ఎం డీయూ వాహనదారులకు ఆర్డీవో వీవీఎస్‌ శర్మ సూచించారు. గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాలకు చెందిన డీలర్లు, ఎండీయూ వాహనదారులతో గాండ్లపెంట సివిల్‌ సప్లయ్‌ గోదాములో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు

ఇంటి వద్దకే రేషన అందించాలి
rdo డీలర్లతో మాట్లాడుతున్న ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ

గాండ్లపెంట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకే వెళ్లి రేషన సరుకులు అందించాలని స్టోర్‌ డీలర్లకు, ఎం డీయూ వాహనదారులకు ఆర్డీవో వీవీఎస్‌ శర్మ సూచించారు. గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాలకు చెందిన డీలర్లు, ఎండీయూ వాహనదారులతో గాండ్లపెంట సివిల్‌ సప్లయ్‌ గోదాములో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తూకాలలో తేడాలు రాకూడదని, రేషన సరుకులు పక్కదారి పడితే చర్య లు తప్పవని హెచ్చరించారు. స్టాక్‌ నిర్వహణ సక్రమంగా ఉండాలని, సీఎ్‌సడీటీ, ఎండీయూ వాహనదారులు, డీలర్లు సమన్వయం తో పని చేయాలని అన్నారు. అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో గాండ్లపెంట, ఎన్పీకుంట ఎమ్మార్వోలు బాబురావు, దేవేంద్రనాయక్‌, సీఎ్‌సడీటీ వాణి, స్టాకీస్ట్‌ వెంకటేశ్వర్లు, డీలర్లు బాబు, సంజీవరెడ్డి, నరసింహులు, మల్లయ్య, వెంకటేష్‌, ఎండీయూ వాహనదారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:23 AM