Jagan Ration Scam: జగన్ జమానాలో రేషన్ అక్రమాలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 05:20 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు డిమాండ్ చేశారు.
ఐదేళ్ల అవినీతిపై విచారణ జరపాలి: లీలా మాధవరావు
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్డుదారులకు మెరుగైన సేవలందించేందుకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించడంపై జగన్ చేసిన విమర్శలను ఆయన గురువారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. ‘టీడీపీ హయాంలో ప్రజాపంపిణీ వ్యవస్థ దేశంలోనే నంబర్ వన్‌గా ఉండేది. వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా దిగజార్చి పూర్తిగా భ్రష్ఠు పట్టించింది. రేషన్ అక్రమ రవాణాకు దోహదపడుతున్న రేషన్ వాహనాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎండీయూ ఆపరేటర్ల తరఫున వైసీపీ వకాల్తా పుచ్చుకుంది. నిధులు సమకూర్చి మరీ కోర్టులో పిటిషన్ వేయించింది. అవసరమైతే రేషన్ డీలర్ల సంఘం తరఫున మేంకూడా ఇంప్లీడ్ అవుతాం’ అని తెలిపారు.