Share News

AP Ration: ఒక్క రోజులోనే 14 లక్షల మందికి రేషన్..

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:12 PM

గత రెండు నెలల్లో తొలి రోజున జరిగిన రేషన్ పంపిణీ కంటే నేడు ఎక్కువ మంది లబ్దిదారులకు రేషన్ అందిందని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఒక్క రోజులోనే 14 లక్షల మంది రేషన్ పొందారని వెల్లడించింది.

AP Ration: ఒక్క రోజులోనే 14 లక్షల మందికి రేషన్..
Ration

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజులోనే 14,45,418 మందికి రేషన్ దుకాణాల ద్వారా పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే చౌక దుకాణాల ద్వారా లక్ష మంది లబ్దిదారులు పీడీఎస్ రేషన్ పొందారు. మొత్తం 29,760 రేషన్ షాపుల ద్వారా పండుగ వాతావరణంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. ఎండీయూ వాహనాలకంటే మెరుగ్గా చౌక డిపోల వద్దే బియ్యం పంపిణీ ప్రక్రియ జరిగింది.

14 లక్షల మందికి

గత రెండు నెలల్లో తొలి రోజున జరిగిన రేషన్ పంపిణీ కంటే ఈ రోజు ఎక్కువ మంది లబ్దిదారులకు రేషన్ అందింది. ఎండీయూ వాహనాల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో తొలిరోజు 12 లక్షలు కూడా దాటని రేషన్ తీసుకున్న లబ్దిదారుల సంఖ్య... నేడు 14 లక్షల మందికి సరఫరా అయిందని పౌరసరఫరాల శాఖ తెలిపింది.


1 కోటీ 46 లక్షల కార్డు దారులకు

ఇవాళ ఉదయం నుంచే రేషన్ షాపులకు లబ్దిదారులు తమకు వీలున్న సమయంలో వచ్చి రేషన్ తీసుకున్నారు. 65 ఏళ్లు వయస్సు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లు ఇంటివద్దే రేషన్ పంపిణీ చేశారు. జూన్ 1 నుంచి 15 తేదీ వరకూ 1 కోటీ 46 లక్షల కార్డు దారులకు బియ్యం ,నిత్యావసర వస్తువులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ చేయనున్నారు.

ఏ రేషన్ షాప్ నుండైనా

పోర్టబిలిటీ సౌకర్యంతో కార్డుదారులు సమీపంలోని ఏ రేషన్ షాప్ నుండైనా సరుకులు పొందే అవకాశం ఉందన్నారు. చౌక దుకాణాల ద్వారా రేషన్ పంపిణీని మరింత మెరుగ్గా చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో ఎండీయూ వాహనం ఎప్పుడు వీధిలోకి వస్తుందో తెలీని పరిస్థితిలో తమ దినసరి వేతనాన్ని, పనుల్ని నష్టపోయే వారమని కానీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము రేషన్ తీసుకుంటున్నామని లబ్దిదారులు పేర్కొన్నారు.


Also Read:

ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి కార్యక్రమాలు.. జగన్‌పై ఎంపీ ఫైర్

For More Telugu News

Updated Date - Jun 01 , 2025 | 08:58 PM