రంగోత్సవం పోటీలు
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:01 AM
స్థానిక తాండ్రపాడు జిల్లా విద్యా శిక్షణ సంస్థలో బుధవారం జిల్లా స్థాయి రంగోత్సవం పోటీలు నిర్వహించారు.
విజేతలకు బహుమతి ప్రదానం
కర్నూలు ఎడ్యుకేషన, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక తాండ్రపాడు జిల్లా విద్యా శిక్షణ సంస్థలో బుధవారం జిల్లా స్థాయి రంగోత్సవం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు 45 మంది వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ప్రిన్సిపాల్ డా.ఎన. అయూబ్ హుశేన బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఏపీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి క్విజ్ పోటీల్లో మొదటి బహుమతి ఎం శీఫామహావిష్, ద్వితీయ బహుమతి ఎస్. పూజ, తృతీయ బహుమతి మహ్మద్ షఫీ, డ్రాయింగ్, కాంపిటీషనలో భారత స్వాతంత్ర సమరయోధుల చిత్రాల్లో ప్రథమ బహుమతి కే. విశాల్, ద్వితీయ బహుమతి కే. చురదీపిక, తృతీయ బహుమతి అరీఫ్ అహ్మద్, చేతిరాత (తెలుగు, ఇంగ్లీషు) పోటీల్లో ప్రథమ బహుమతి ఏ. హర్షిత (తెలుగు), ద్వితీయ బహుమతి ధర్మతేజ, తృతీయ బహుమతి ఏ. జానకి, ఇంగ్లీషు మీడియంలో ప్రథమ బహుమతి కే. శిరీష, ద్వితీయ బహుమతి జయశ్రీ సాయిమీనాక్షి, తృతీయ బహుమతి లెనిన కుమార్, రంగోలి పోటీల్లో ప్రథమం జి.అక్షరశ్రీ, రెండో బహుమతి కే.పావని గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ, పంజాబ్ ఫోక్ డ్యాన్స కాంపిటీషనలో మొదటి బహుమతి సమీర, రెండో బహుమతి ఏ. సాయి, డిజిటల్ కోలార్జ్ (యూనిట్, ఇంటిగ్రేటెడ్ పోస్టల్) ఎం.కే. ఆదిత్య ప్రథమ బహుమతి, ఏ. రవితేజ రెండో బహుమతి, స్లోగన రచనల్లో శ్రేష్ట భారతలో ప్రథమ బహుమతి గీతాన్విత, రెండో బహుమతి కే. మాధవి సొంతం చేసుకున్నారు. రోల్‌ప్లే (భారత దేశ సంస్కృతి చరిత్ర, విలువలు) పోటీలో హసీఫా, పి. యాస్మిన, టి. అభినవ్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.