Share News

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీల్లో దరఖాస్తులకు ఆహ్వానం

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:24 AM

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ నోటిఫికేషన్‌ విడుదల. ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.

IIIT Admissions: ట్రిపుల్‌ ఐటీల్లో దరఖాస్తులకు ఆహ్వానం

నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో 4,400 సీట్లు

27 నుంచి మే 20 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరణ

నూజివీడు టౌన్‌/వేంపల్లె, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలలో 4,400 సీట్లకు ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ట్రిపుల్‌ ఐటీ అధికారులు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మెరిట్‌ ప్రాతిపదికన ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సు కోసం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. రిజర్వేషన్‌ విధానాన్ని అనుసరించి మెరిట్‌, అర్హత పరీక్షలో ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్జీయూకేటీ.ఇన్‌ లేదా ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్థులు రూ.300, రిజర్వు కేటగిరి అభ్యర్థులు రూ.200, ఇతర రాష్ర్టాల అభ్యర్థులు రూ.వెయ్యి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:25 AM