Liquor Scam Case:రాజ్ కసిరెడ్డికి దొరకని ఊరట
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:10 AM
మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. సిట్ అధికారులు ఆయన తల్లిదండ్రులను వారి ఇంట్లోనే అడ్వకేట్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఆదేశాలు
ఇంటి వద్దే విచారించేలా ఆదేశాలివ్వండి
మరో పిటిషన్‌లో రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రుల వినతి
అమరావతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరిన రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన పిటిషన్‌పై విచారణను వారం రోజులు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ టి.మల్లిఖార్జునరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆన్‌లైన్ ద్వారా విచారణకు కసిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే హాజరయ్యారు. మధ్యంతర ముందస్తు బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామని, అత్యవసరంగా దానిపై విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ...ఇప్పటికే పిటిషన్‌ను వాయిదావేశామని తెలిపారు. మంగళవారం కోర్టు విచారణ ప్రారంభ సమయంలో అభ్యర్థనను తమ ముందు ఉంచాలని సూచించారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో తమను విచారించాలని భావిస్తే హైదరాబాద్‌లోని తమ నివాసంలో లేదా ఏదైనా తటస్థ ప్రదేశంలో అడ్వకేట్ సమక్షంలో విచారణ చేసేలా సిట్ దర్యాప్తు అధికారిని ఆదేశించాలంటూ రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులు ఉపేందర్‌రెడ్డి, సుభాషిని హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.
బీఎన్‌ఎ్‌సఎస్ చట్టనిబంధనలు అనుసరించేలా పోలీసులకు సూచించాలని పిటిషన్‌లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని న్యాయస్థానం లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘దర్యాప్తు అధికారి ఇచ్చిన నోటీసులను అనుసరించి పిటిషనర్లు విజయవాడలోని సిట్ ముందు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు పిటిషనర్ ఉపేందర్‌రెడ్డిని దూషించారు. పిటిషనర్లు ఇద్దరూ 60ఏళ్లకు పైబడి వయసు ఉన్నవారే. బీఎన్‌ఎ్‌సఎస్ చట్టనిబంధనలు ప్రకారం వారిని ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుంది.’’ అని వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ స్పందిస్తూ....బీఎన్‌ఎ్‌సఎస్ సెక్షన్ 179 మేరకు పిటిషనర్లను వారి ఇంటి వద్ద విచారించేందుకు అభ్యంతరం లేదన్నారు. విచారణ సందర్భంగా దూషణలకు పాల్పడ్డారని పోలీసు అధికారులపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అధికారులను ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. అధికారులపై చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్... పిటిషనర్లను అడ్వకేట్ సమక్షంలో వారి ఇంటి వద్దే విచారించాలని సిట్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేశారు. అధికారులపై పిటిషనర్లు చేసిన ఆరోపణలకు కౌంటర్ వేసేందుకు ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చారు. విచారణను మే ఐదోతేదీకి వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..