Polio Vaccination Drive: నేడు పల్స్ పోలియో
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:29 AM
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 38,267 కేంద్రాల ఏర్పాటు
54.07 లక్షల మంది చిన్నారులకు 98.99 లక్షల డోసులు సిద్ధం
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐదేళ్ల లోపు వయసున్న 54,07,663 మంది పిల్లలకు రెండు చుక్కలు వేయనున్నారు. ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా 38,267 పోలియో చుక్కల కేంద్రాలను సిద్ధం చేసింది. చిన్నారుల కోసం 98,99,300 డోసులను అందుబాటులో ఉంచింది. రెండు రోజుల క్రితం ఈ పోలియో డోసులను అన్ని జిల్లాలకు పంపించింది. పల్స్ పోలియో కార్యక్రమ పర్యవేక్షణ కోసం అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది.
రాష్ట్రవ్యాప్తంగా 76,534 బృందాలను అందుబాటులో ఉంచారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ రోజు పలు కారణాల వల్ల పిల్లలకు చుక్కలు వేయించలేకపోతే.. ఈనెల 22, 23వ తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 1,854 మొబైల్ బృందాలను కూడా ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచింది. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరు ఈ నెల 21 నుంచి 23 వరకు ముందుగా గుర్తించిన పలు ప్రాంతాలు పర్యటించి అక్కడ చిన్నారులకు రెండు చుక్కలు వేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Amaravati Quantum Valley: టార్గెట్ 2030
Cold Wave Hits Telugu States: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ముందెన్నడూ లేని విధంగా..