Pulivendula dispute: టీడీపీ జెండాలు ఫ్లెక్సీల తొలగింపు..
ABN , Publish Date - May 29 , 2025 | 05:46 AM
పులివెందులలో టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల తొలగింపు వ్యవాదంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్‌చైర్మన్ హఫిజుల్లా సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నాయకులు లాయర్‌తో కలిసి పోలీసులు చర్చించినట్టు తెలియజేశారు.
పోలీసుల అదుపులో పులివెందుల మున్సిపల్ చైర్మన్
వైస్‌చైర్మన్ సహా మరో 11 మంది కూడా..
పులివెందుల, మే 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ జెండాలు, ఫ్లెక్సీల తొలగింపు వివాదంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్‌చైర్మన్ హఫిజుల్లాతో పాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మహానాడు సందర్భంగా మంగళవారం పులివెందులలో పార్నపల్లె కూడలి నుంచి రింగురోడ్డు వెంబడి కడప కూడలి వరకు ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. వైఎస్ విగ్రహాల వద్ద కూడా జెండాలు, తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలను చించేశారు. ఈ ఘటనకు సంబంధించి బుధవారం రాత్రి పోలీసులు మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ సహా 12 మందిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇది తెలుసుకున్న వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి మరికొందరు నాయకులు లాయర్‌తో కలిసి వెళ్లి డీఎస్పీ మురళి నాయక్‌తో చర్చించారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News