జనజాగృతి సేవలు భేష్: ఎస్పీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:00 AM
మహిళ సాధికారిత అభివృద్ధికి, మహిళలలో చైతన్యం నింపడానికి జనజాగృతి సంస్థ మూడు దశాబ్దాలుగా తీవ్రంగా కృషి చేస్తోందని ఎస్పీ రత్న కొనియాడారు.

తనకల్లు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మహిళ సాధికారిత అభివృద్ధికి, మహిళలలో చైతన్యం నింపడానికి జనజాగృతి సంస్థ మూడు దశాబ్దాలుగా తీవ్రంగా కృషి చేస్తోందని ఎస్పీ రత్న కొనియాడారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలోని సాయిఆరామంలో మహిళల అభివృద్ధికి పాటుపడిన వారిని ఎస్పీ సన్మానించారు. అందులో భాగంగా జనజాగృతి సంస్థ అధ్యక్షుడు బలరాంను సన్మానించారు. ఈ సంస్థ తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, అమడగూరు, నల్లమాడ, ఓబుళదేరచెరువు, నంబులపూలకుంట, కదిరి, పెనుకొండ, రొద్దం, చెన్నైకొత్తపల్లి, పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందెపల్లి, ముదిగుబ్బ, బుక్కపట్నం మండలాల్లోని మహిళల్లో చైతన్యం నింపడానికి కృషి చేసిందన్నారు.