ఉపాధి పనులు కల్పించండి
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:04 AM
తమకు ఉపాధి పథకం కింద పనులు కల్పించాలని మండలంలోని ఎర్రగుట్టపల్లి గ్రామానికి చెందిన కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

తనకల్లు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తమకు ఉపాధి పథకం కింద పనులు కల్పించాలని మండలంలోని ఎర్రగుట్టపల్లి గ్రామానికి చెందిన కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. వారు శుక్రవారం మాట్లాడుతూ.. తాము అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, పీటీఎం ప్రాంతాలకు కూలి పనుల కోసం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన చెందారు. తమ గ్రామంలో సుమారు 80 కుటుంబాలు ఉన్నాయని, ఎవరికి ఉపాఽధి హామీ జాబ్‌కార్డులు లేవని అన్నారు. జాబ్‌కార్డులు ఇస్తే ప్రతిరోజు ఉపాధి పనులకు వెళ్తామని అన్నారు. దీనిపై ఉపాధిహామీ పథకం ఇంజనీరింగ్ కనసల్టింగ్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ... గతంలో గ్రామంలో జాబ్‌కార్డులుండేవని, ఉపాధి పనులకు ఆ గ్రామస్థులు రాకపోవడంతో అవి రద్దు అయ్యాయని, ఉపాధి పనులు చేస్తామంటే అందరికి జాబ్‌కార్డులు మంజూరుచేస్తామని అన్నారు.