వ్యవసాయ భూములకు దారి సౌకర్యం కల్పించండి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:37 PM
తమ వ్యవసాయ భూములకు వెళ్లనీయకుండా కొందరు దారి మూసి వేశారని, అధికారులు జోక్యం చేసుకుని డీకేటీ భూముల్లో దారి సౌకర్యం కల్పిం చాలని నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామానికి చెందిన 25 మంది రైతులు కోరారు.

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): తమ వ్యవసాయ భూములకు వెళ్లనీయకుండా కొందరు దారి మూసి వేశారని, అధికారులు జోక్యం చేసుకుని డీకేటీ భూముల్లో దారి సౌకర్యం కల్పిం చాలని నిమ్మనపల్లె మండలం బండ్లపై గ్రామానికి చెందిన 25 మంది రైతులు కోరారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరే ట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌కు డివిజన నలుమూలల నుంచి వచ్చిన 63 మంది అర్జీలు ్ఞఅంద జేశారు. బండ్లపై రైతులు మాట్లాడుతూ పలుమార్లు తమ సమస్యలను అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. నిమ్మన పల్లె మండలం వెంగంవారిపల్లె సమీపంలో కుంటపొరంబోగు భూమికి సంబంధించి నాలుగేళ్ల క్రితం కొందరు రికార్డులు మార్చివేసి ఆక్రమించుకున్నారని, దీనిపై పాత రికా ర్డులు పరిశీలించి రూ.60లక్షల విలువైన ప్రభుత్వ భూమి కాపాడాలని రైతు రామచం ద్రారెడ్డి సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం బీకేపల్లె కాలనీలో 45 మం ది చిన్నారులు ఉన్నారని, ఈ ప్రాంతంలో అదనపు అంగనవాడీ సెంటర్ మంజూరు చేయాలని పోర్డు సంస్థ డైరెక్టర్ లలితమ్మ, ప్రతినిధులు సుభాషిణి, నరసింహులు సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. వాటితో పాటు సామాజిక పింఛన్లు, హౌసింగ్ స్థలాలు, సర్వే సమస్యలపై పలువురు అర్జీలు అందజేశారు.