అధికారులు హామీ ఇచ్చేవరకు దీక్షలు తప్పవు
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:56 PM
రెవెన్యూ అధికారులు నిర్ధిష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలు విరమించ మని బాధితులు స్పష్టం చేశారు.

గోపవరం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యో తి): రెవెన్యూ అధికారులు నిర్ధిష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్షలు విరమించ మని బాధితులు స్పష్టం చేశారు. గోపవరం మండలం పీపీ కుంట వద్ద చిన్న పాటి గుడిసెలు రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మూడురోజులుగా జరుగుతున్న రిలేదీక్షలకు మద్దతుగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ హాజరై మాట్లాడుతూ పేదల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పైపెచ్చు గుడిసెలను తొలగిస్తామని హెచ్చరిక లు చేయడం దారుణమన్నారు. రెవెన్యూ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షలకు పూనుకుంటామని ఆయన తెలిపారు. గోపవరం తహసీల్దారు స్పందించి ఎప్పుడూ ప్రజలకు అన్యాయం చేయనని, మీరు మీ దరఖాస్తులను అందిస్తే జాబితాను కలెక్టరుకు పంపి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో భూపోరాట కమిటీ కన్వీనరు పీవీ రమణ, గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, శాఖ కార్యదర్శి వెంకట య్య, సహాయకార్యదర్శి ఓబులేసు, కమిటీ సభ్యులు గురయ్య శివ, సుబ్బరా యుడు, లక్ష్మమ్మ, ఓబులమ్మ ప్రభాకర్, రమాదేవిపాల్గొన్నారు.